Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఆలయాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి: ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్

    Author RAJANEETHI | 10 Jul 2026, 11:20 PM | Array
    ఆలయాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి: ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్

    దేవాదాయ శాఖ ఆలయాలపై సమీక్ష.. పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశం...

    చిత్తూరు(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్):చిత్తూరు నగర పరిధిలోని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోని అన్ని ఆలయాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి, ప్రశాంత వాతావరణంలో దైవ దర్శనం జరిగేలా చర్యలు తీసుకోవాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కార్యాలయంలో నగరంలోని దేవాదాయ శాఖకు చెందిన ఆలయాల కమిటీ చైర్మన్లు, సభ్యులు, అర్చకులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయాలు భక్తుల ఆధ్యాత్మిక విశ్వాసానికి కేంద్రాలుగా ఉన్నందున అక్కడ పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, క్యూలైన్లు వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని సూచించారు. ఆలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
    ఆలయాల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై ఎమ్మెల్యే ఆరా తీశారు. వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం అవసరమైన సహకారం అందిస్తుందని తెలిపారు.సమావేశంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ చిట్టమ్మ, వివిధ ఆలయాల కమిటీ చైర్మన్లు, సభ్యులు, అర్చకులు, శాఖ అధికారులు పాల్గొన్నారు.

    ఆలయాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి: ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ - Additional Image