Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ప్రజాదర్బార్‌లో వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్

    Author RAJANEETHI | 10 Jul 2026, 11:14 PM | Array
    ప్రజాదర్బార్‌లో వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్

    చిత్తూరు(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్): చిత్తూరు ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అర్జీదారులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన, పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. పరిష్కరించగల అంశాలపై అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.ఈ సందర్భంగా పలు సంఘాల ప్రతినిధులు ఎమ్మెల్యేకు వినతిపత్రాలు సమర్పించారు. చిత్తూరులో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న కమర్షియల్ టాక్స్ కార్యాలయాన్ని తిరుపతికి తరలించకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత ఉద్యోగులు కోరారు. అలాగే నగర ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్‌కు స్థలం కేటాయించాలని ఫోటోగ్రాఫర్ల ప్రతినిధులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తూ సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసి వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.