Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • తిరుపతి టీడీపీ ఇన్‌చార్జిగా జె.బి. శ్రీనివాసులు.. శుభాకాంక్షలు తెలిపిన జనసేన నేత చంద్రమౌళి

    Author RAJANEETHI | 08 Jul 2026, 04:03 PM | Array
    తిరుపతి టీడీపీ ఇన్‌చార్జిగా జె.బి. శ్రీనివాసులు.. శుభాకాంక్షలు తెలిపిన జనసేన నేత చంద్రమౌళి

    చిత్తూరు(జులై 08),(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్):తెలుగు దేశం పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా పార్టీ నూతన ఇన్‌చార్జిగా జె.బి. శ్రీనివాసులు నియమితులయ్యారు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు, పార్టీ శ్రేణులు ఆయనను కలిసి అభినందనలు తెలియజేస్తున్నారు. జిల్లా పార్టీ బలోపేతానికి, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు అందజేస్తున్నారు.ఈ నేపథ్యంలో చిత్తూరు జనసేన సీనియర్ నాయకులు చంద్రమౌళి జె.బి. శ్రీనివాసులను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. తిరుపతి జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారం అభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రజలకు చేరువయ్యే విధంగా పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ఆయన విజయవంతంగా బాధ్యతలు నిర్వహించాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా జె.బి. శ్రీనివాసులు మాట్లాడుతూ పార్టీ అధిష్ఠానం తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పని చేస్తూ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకొని తిరుపతి జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానన్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రజా సమస్యలపై చురుకుగా స్పందిస్తామని తెలిపారు.చిత్తూరు జనసేన సీనియర్ నాయకులు చంద్రమౌళి మాట్లాడుతూ ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా పని చేసే నాయకత్వానికి ఎల్లప్పుడూ తమ సహకారం ఉంటుందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించే దిశగా అన్ని ప్రజాహిత కార్యక్రమాలకు మద్దతు కొనసాగుతుందని పేర్కొన్నారు. జె.బి. శ్రీనివాసులు కొత్త బాధ్యతల్లో విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ మరోసారి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొని జె.బి. శ్రీనివాసులను అభినందించారు. పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన నాయకత్వంలో తిరుపతి జిల్లాలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నాయకుల పరస్పర మర్యాదపూర్వక భేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.