Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • నల్లపాలెంలో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ

    Author RAJANEETHI | 04 Jul 2026, 10:24 AM | Array
    నల్లపాలెంలో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ

    రేణిగుంట మండలం నల్లపాలెం గ్రామంలో శనివారం పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బొజ్జల బృందమ్మ హాజరై అర్హులైన రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా రైతులు తమ భూ వివరాలను పరిశీలించుకుని ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రేణిగుంట తహసీల్దార్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ, భూ రికార్డుల పారదర్శకతకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రెవెన్యూ శాఖ చర్యలు చేపడుతోందని తెలిపారు. కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, స్థానిక నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.