Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని పటిష్టంగా నిర్వహిస్తున్నాం-జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

    జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని పటిష్టంగా నిర్వహిస్తున్నాం-జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

    మదనపల్లి, జూలై 02:

    జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పటిష్టంగా అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు.

    ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (Special Intensive Revision - SIR) కార్యక్రమం పురోగతిపై గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘం (ECI) అధ్యక్షతన... రాష్ట్రంలోని జిల్లాల్లో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం అమలు, పురోగతి, క్షేత్రస్థాయి చర్యలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవతో కలిసి జిల్లా ఎన్నికల అధికారు(DEO)లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

    ఇవి కూడా చదవండి

    ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు మదనపల్లి కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌ నుంచి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డీఆర్వో చంద్రశేఖర్ రెడ్డి, నారాయణ రెడ్డి, ఎస్‌డీసీ మాధవ కృష్ణారెడ్డి హాజరయ్యారు.

    వీడియో కాన్ఫరెన్స్‌లో ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో చేపడుతున్న చర్యలు, క్షేత్రస్థాయి పురోగతి, నమోదు మరియు పరిశీలన కార్యక్రమాలపై జిల్లా వారీగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సమీక్షించారు. ఓటరు జాబితాల ఖచ్చితత్వం, పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తూ ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఇంటింటి స్థాయిలో పరిశీలన, అర్హులైన ప్రతి ఒక్కరి పేర్ల నమోదుకు చర్యలు తీసుకోవాలని, ఎలాంటి లోపాలు లేకుండా ఎన్నికల ప్రక్రియను నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

    ఈ సందర్భంగా జిల్లాలో 12,32,439 మంది ఓటర్లు ఉన్నారని, ఇప్పటివరకు 12,22,287 మంది ఓటర్లకు 99.18 శాతం మేర ఎలక్షన్ ఫార్మ్స్ పంపిణీ చేయడం జరిగిందన్నారు. మ్యాపింగ్, డిజిటలైజేషన్ ప్రక్రియలను వేగవంతం చేస్తున్నట్టు పేర్కొన్నారు. 4,74,804 మంది డిజిటలైజేషన్ ప్రక్రియ 38.53 శాతం పూర్తయ్యిందని, బుక్ ఏ బి. ఎల్.వో ద్వారా 3852 కాల్స్ మాట్లాడి పరిష్కరించడం జరిగిందని తెలిపారు. ఓటరు జాబితాలో ఖచ్చితత్వం ఉండేలా, పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తూ, ఫారంల పంపిణీ, మ్యాపింగ్, డిజిటలైజేషన్ ప్రక్రియ తదితర అంశాలలో ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తీరును కలెక్టర్ వివరించారు.

    ఈ వీసీలో కలెక్టరేట్ ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.
    ----------------------------------////--------------------------------
    డిఐఆర్ఓ, అన్నమయ్య జిల్లా