Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • వడ్డెర దైవం నారా చంద్రబాబు నాయుడు.. దేవళ్ళ రమణ

    Author RAJANEETHI | 06 Sep 2026, 04:07 PM | Array
    వడ్డెర దైవం నారా చంద్రబాబు నాయుడు.. దేవళ్ళ రమణ

    రేణిగుంట సెప్టెంబర్ 6 (రాజనీతి): వడ్డెర సామాజిక వర్గానికి చెందిన దళవాయి రమాదేవికి తొలిసారిగా ఎమ్మెల్సీ పదవి కల్పించిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతగా వడ్డెర సంఘం తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి దేవళ్ళ రమణ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ వడ్డెర సంఘం నాయకులు రేణిగుంటలో సంబరాలు నిర్వహించారు.ఆదివారం పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి వడ్డెర దైవం నారా చంద్రబాబు నాయుడు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా దేవళ్ళ రమణ మాట్లాడుతూ అట్టడుగు వర్గానికి చెందిన సాధారణ కార్యకర్తకు ఎమ్మెల్సీ పదవి కల్పించడం వడ్డెర సమాజానికి గర్వకారణమన్నారు. వడ్డెరల సంక్షేమానికి కృషి చేస్తున్న చంద్రబాబు నాయుడుకు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వడ్డెర నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

    వడ్డెర దైవం నారా చంద్రబాబు నాయుడు.. దేవళ్ళ రమణ - Additional Image