Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఎస్కేఆర్‌ ఆసుపత్రిలో వ్యక్తి మృతిపై సమగ్ర విచారణ జరపాలి: దుబ్బా శ్రీకాంత్‌

    Author RAJANEETHI | 31 Aug 2026, 05:53 PM | Array
    ఎస్కేఆర్‌ ఆసుపత్రిలో వ్యక్తి మృతిపై సమగ్ర విచారణ జరపాలి: దుబ్బా శ్రీకాంత్‌

    మదనపల్లె, ఆగస్టు 31 (రాజనీతి): పీలేరులోని ఎస్‌.కే.ఆర్‌. ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కేవీపల్లె మండలం జాండ్రపేటకు చెందిన కె.సురేంద్ర (42) మృతి చెందిన ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని జిల్లా కాంగ్రెస్‌ కమిటీ ఉపాధ్యక్షుడు దుబ్బా శ్రీకాంత్‌ డిమాండ్‌ చేశారు. కిడ్నీలో రాళ్ల సమస్యతో ఆగస్టు 26న ఆసుపత్రిలో చేరిన సురేంద్రకు ఆపరేషన్‌ కోసం రూ.35 వేలు తీసుకున్నారని కుటుంబ సభ్యులు తెలిపారని పేర్కొన్నారు. ఆగస్టు 27న ఆపరేషన్‌ థియేటర్‌కు తీసుకెళ్లిన కొద్దిసేపటికే పరిస్థితి విషమించి మృతి చెందినట్లు తెలిపారు. ఘటనపై జిల్లా స్థాయి నిపుణుల వైద్య బృందంతో విచారణ చేపట్టి ఆపరేషన్‌, అనస్థీషియా రికార్డులు, వైద్య నివేదికలు, బిల్లులు, సీసీటీవీ దృశ్యాలను పరిశీలించాలని కోరారు. ఆసుపత్రి లైసెన్సులు, వైద్యుల అర్హతలు, అత్యవసర వైద్య సదుపాయాలను తనిఖీ చేయాలని విజ్ఞప్తి చేశారు. వైద్య నిర్లక్ష్యం లేదా నిబంధనల ఉల్లంఘన తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కుటుంబానికి న్యాయం చేయాలని శ్రీకాంత్‌ కోరారు.