Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఏఐ నేర్చుకో.. భవిష్యత్తును గెలుచుకో! సీతమ్స్ లో విద్యార్థులకు ప్రాక్టికల్‌ ఏఐ శిక్షణ...

    Author | 14 Aug 2026, 04:46 PM | Array
    ఏఐ నేర్చుకో.. భవిష్యత్తును గెలుచుకో! సీతమ్స్ లో విద్యార్థులకు ప్రాక్టికల్‌ ఏఐ శిక్షణ...

    చిత్తూరు(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్): ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) ప్రాధాన్యం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులకు దానిపై ఆచరణాత్మక అవగాహన కల్పించేందుకు సిటామ్స్‌లో రెండు రోజుల వర్క్‌షాప్‌ నిర్వహించారు. ‘ఏఐ ఫర్‌ ఎవ్రీ మైండ్‌’ పేరుతో ఆగస్టు 13, 14 తేదీల్లో సత్య కేశవ్‌ గ్యాలరీలో ఈ కార్యక్రమం జరిగింది. సీఎఐ, సీఎస్‌డీ, సీఎస్‌ఎం విభాగాలు సంయుక్తంగా నిర్వహించాయి.విజన్‌ డిజిటల్‌ ఇండియా సహ వ్యవస్థాపకుడు, చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ తారక్‌రామ్‌ మారమ్‌, అకాడమిక్‌ ట్రైనర్‌, ఏఐ అండ్‌ డేటా టెక్నాలజీ ఎడ్యుకేటర్‌ హఫ్సా మెరాజ్‌ శిక్షణ ఇచ్చారు. ఏఐలో వస్తున్న నూతన సాంకేతికతలు, వాటి వినియోగం, కంప్యూటర్‌ విజన్‌, ఆటోమేషన్‌, ఏఐ ఆధారిత ప్రాజెక్టులపై విద్యార్థులకు ప్రాక్టికల్‌ శిక్షణ అందించారు.

    నిద్రమత్తును గుర్తించే ఏఐ...

    వర్క్‌షాప్‌లో భాగంగా నిర్వహించిన ప్రత్యక్ష ప్రదర్శనలు విద్యార్థులను విశేషంగా ఆకట్టుకున్నాయి. డ్రైవర్‌ కళ్ల కదలికలను పర్యవేక్షిస్తూ నిద్రమత్తును గుర్తించే ఏఐ ఆధారిత వ్యవస్థను ప్రదర్శించారు. అలాగే వ్యక్తి గదిలోకి ప్రవేశించగానే ఆటోమేటిక్‌గా ఫ్యాన్‌ ఆన్‌ అయ్యేలా రూపొందించిన మానవ ప్రవేశ గుర్తింపు వ్యవస్థను చూపించారు. వాస్తవ జీవిత సమస్యలకు ఏఐ, కంప్యూటర్‌ విజన్‌, ఆటోమేషన్‌ను ఎలా అన్వయించవచ్చో విద్యార్థులు ప్రత్యక్షంగా తెలుసుకున్నారు.

    ఇవి కూడా చదవండి

    ఆవిష్కరణల వైపు అడుగులు....

    ఏఐ ఆధారిత ప్రాజెక్టులు, నూతన ఆవిష్కరణలు, స్టార్టప్‌లు, వ్యాపార అవకాశాలు, భవిష్యత్తు కెరీర్‌ అవకాశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కేవలం పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు.సీతమ్స్ ఛైర్మన్‌ కె. రంగనాథం, శ్రీనివాస ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ డాక్టర్‌ డి.ఏ. కల్పజా ప్రోత్సాహంతో కార్యక్రమం జరిగింది. సిటామ్స్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రొఫెసర్‌ కె. నాగేంద్ర ప్రసాద్‌ నాయకత్వంలో విద్యార్థుల్లో సాంకేతిక ఆలోచనా విధానం, సృజనాత్మకతను పెంపొందించేలా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని సీఎఐ విభాగాధిపతి ప్రొఫెసర్‌ ఎం.ఈ. పళనివేల్‌ సమన్వయం చేశారు. అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.