Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • రేణిగుంటలో జ్ఞానజ్యోతి శిక్షణ ప్రారంభం

    Author RAJANEETHI | 11 Aug 2026, 03:14 PM | Array
    రేణిగుంటలో జ్ఞానజ్యోతి శిక్షణ ప్రారంభం

    రేణిగుంట, ఆగస్టు 11 (రాజనీతి): రేణిగుంట జెడ్పీ బాలికల పాఠశాలలో మూడు రోజులపాటు నిర్వహించనున్న జ్ఞాన జ్యోతి శిక్షణ కార్యక్రమాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఐసీడీఎస్‌ సీడీపీవో కృష్ణవేణి, ప్రధానోపాధ్యాయురాలు, శిక్షణ ఉపాధ్యాయుడు లోకనాథం, సూపర్‌వైజర్‌ అనంతలక్ష్మి ఆధ్వర్యంలో జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. 0–6 ఏళ్ల పిల్లల మెదడు, కండరాల అభివృద్ధి, సృజనాత్మకత, విద్య, ఆటపాటలు, సంభాషణ ద్వారా సమగ్ర అభివృద్ధికి అవసరమైన అంశాలపై శిక్షణ ఇస్తున్నట్లు కృష్ణవేణి తెలిపారు. 9 మంది చొప్పున బృందాలుగా అంగన్‌వాడీ సిబ్బందిని విభజించి చార్టులు, డెమోల ద్వారా శిక్షణ అందించారు.