Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • గుడిసిబండ యువకుడి సినీ ప్రస్థానం.. ఐదు చిత్రాల్లో ప్రశాంత్ యాదవ్ నటన....

    Author | 05 Aug 2026, 10:22 PM | Array
    గుడిసిబండ యువకుడి సినీ ప్రస్థానం.. ఐదు చిత్రాల్లో ప్రశాంత్ యాదవ్ నటన....

    పల్లె నుంచి వెండితెరకు.. ప్రతిభతో గుర్తింపు తెచ్చుకుంటున్న ప్రశాంత్....

    నాటకాలపై మక్కువే సినీ అవకాశాలకు బాట.. ఫిలిం ఛాంబర్ సభ్యుడిగా సేవలు...

    చిత్తూరు(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్):చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం గుడిసిబండ గ్రామానికి చెందిన ఆర్. ప్రశాంత్ యాదవ్ సినీరంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. చిన్నప్పటి నుంచే నాటకాలపై అపారమైన ఆసక్తి పెంచుకున్న ఆయన అదే అభిరుచిని క్రమంగా నటనగా మలుచుకుని నేడు వెండితెరపై అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. గ్రామీణ నేపథ్యం నుంచి సినీ రంగంలోకి అడుగుపెట్టి తన ప్రతిభతో ముందుకు సాగుతున్న యువ నటుడిగా ప్రశాంత్ యాదవ్ పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు.పెద్ద మధ్యతరగతి కుటుంబానికి చెందిన ప్రశాంత్ యాదవ్ తండ్రి ఆర్. వెంకటస్వామి, తల్లి ఆర్. సరిజమ్మ. వీరికి ముగ్గురు సంతానం కాగా, ప్రశాంత్ పెద్ద కుమారుడు. సోదరీమణులు ఎం. సునీత, పి. రమ్య. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం స్వీయ కృషితో ఆయన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.బాల్యం నుంచే పాఠశాల, గ్రామీణ సాంస్కృతిక కార్యక్రమాల్లో నాటకాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రశాంత్, అనంతరం షార్ట్ ఫిల్మ్స్, యూట్యూబ్ ప్రాజెక్టులు, టెలివిజన్ సీరియల్స్‌లో నటించి తన నటనా ప్రతిభను చాటుకున్నారు. ప్రతి పాత్రను సహజంగా పోషిస్తూ దర్శకులు నిర్మాతల దృష్టిని ఆకర్షించారు.సినీరంగంలోనే కాకుండా తాను చేసే వృత్తిలోనూ మర్యాదపూర్వక వ్యవహారశైలితో అధికారులతో పాటు సహచరుల ప్రశంసలు పొందుతున్నారు.ప్రస్తుతం ప్రశాంత్ యాదవ్ ఐదు చిత్రాల్లో నటిస్తున్నారు. 'మృత్యూ చక్రం', 'నరమేధం', 'ఐతీరా', 'మిస్టర్ వీరప్పన్', 'ది బ్రెయిన్' చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషిస్తూ తన నటనా ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. ఈ సినిమాలు విడుదలైన తర్వాత తనకు మరిన్ని అవకాశాలు వస్తాయనే ఆశాభావంతో ఆయన ఉన్నారు. పాత్ర చిన్నదైనా పెద్దదైనా ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా నటించాలనే లక్ష్యంతో ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు.సినీరంగంపై ఉన్న ఆసక్తితో ప్రశాంత్ యాదవ్ హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో సభ్యుడిగా కొనసాగుతున్నారు. సినీ పరిశ్రమలో కొత్త అవకాశాలను అన్వేషిస్తూ నటుడిగా మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా ప్రతిభావంతులు సినీరంగంలో రాణించగలరని ఆయన నిరూపిస్తున్నారని స్థానికులు అభినందిస్తున్నారు.కష్టపడితే లక్ష్యాన్ని చేరుకోవచ్చనే నమ్మకంతో నిరంతరం శ్రమిస్తున్న ప్రశాంత్ యాదవ్ భవిష్యత్తులో మరిన్ని చిత్రాల్లో నటించి తెలుగు సినీరంగంలో తనదైన ముద్ర వేయాలని సంకల్పించారు. పుంగనూరు ప్రాంతానికి చెందిన యువకుడు సినీరంగంలో ఎదుగుతుండటం పట్ల గుడిసిబండ గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయన మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నారు.

    ఇవి కూడా చదవండి