Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం పెంపొందించాలి: డి.ఎం.హెచ్.ఓ. డాక్టర్ లక్ష్మీనరసయ్య

    Author RAJANEETHI | 16 Jun 2026, 11:18 PM | ANDHRA PRADESH
    ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం పెంపొందించాలి: డి.ఎం.హెచ్.ఓ. డాక్టర్ లక్ష్మీనరసయ్య

    గాలివీడు : ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (PHC) సేవలపై ప్రజలకు పూర్తి నమ్మకం కలిగే విధంగా సిబ్బంది అంతా అంకితభావంతో విధులు నిర్వహించాలని అన్నమయ్య జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (DM&HO) డాక్టర్ లక్ష్మీనరసయ్య పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన గాలివీడు పి.హెచ్.సి.ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని రికార్డులను పరిశీలించిన ఆయన, వాటి నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం వైద్యాధికారి మాట్లాడుతూ.. అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల ప్రేమ, సానుభూతితో ప్రవర్తించి వారి మన్ననలను పొందాలని సిబ్బందికి సూచించారు. పి.హెచ్.సి.లోని ప్రసవ ప్రయోగ శాల, స్టోర్ రూమ్‌లను తనిఖీ చేసి, అవి ప్రోటోకాల్ ప్రకారం ఉన్నాయా లేదా అని పరిశీలించి పలు సూచనలు చేశారు. అలాగే, ఈ నెల 28న నిర్వహించబోయే పల్స్ పోలియో కార్యక్రమం మరియు ప్రస్తుతం జరుగుతున్న 'స్టాప్ డయేరియా' కార్యక్రమాలపై క్షేత్రస్థాయిలో విరివిగా అవగాహన సమావేశాలు, ర్యాలీలు నిర్వహించి ప్రజలను చైతన్యపరచాలని అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో పి.హెచ్.సి. వైద్యులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.