'తల్లికి వందనం' తో విద్యకు బలం - ఎమ్మెల్యే కిషోర్

రూ.10,120 కోట్లతో 'తల్లికి వందనం' 67 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రూ.15,000 ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అంతమందికీ రూ.15,000 తల్లుల ఖాతాల్లోకి 'తల్లికి వందనం' నిధులు ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి ప్రకటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా తల్లుల ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 'తల్లికి వందనం' పథకం నిధులు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయని, ఈ పథకం విద్యార్థుల జీవితంలో బలమైన పునాదిగా నిలుస్తుందని పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తెలిపారు. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వేలమంది విద్యార్థులు,తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం పండగ వాతావరణం లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా...