కామన్వెల్త్‌లో భారత్‌కు మరో కీలక రోజు.. పతకాల వేటలో భారత స్టార్‌లు

బాక్సింగ్, పారా పవర్‌లిఫ్టింగ్, స్విమ్మింగ్, జిమ్నాస్టిక్స్, లాన్ బౌల్స్‌లో నేడు భారత క్రీడాకారుల పోటీలు.. మరిన్ని పతకాలపై ఆశలు స్కాట్లాండ్‌లో జరుగుతున్న 2026 కామన్వెల్త్ క్రీడల్లో నేడు (జూలై 24) భారత్‌కు అత్యంత కీలకమైన రోజు కానుంది. తొలి రోజు నుంచే మంచి ఆరంభం చేసిన భారత జట్టు, రెండో రోజు మరిన్ని పతకాలను లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ముఖ్యంగా పారా పవర్‌లిఫ్టింగ్, బాక్సింగ్, స్విమ్మింగ్, జిమ్నాస్టిక్స్, లాన్ బౌల్స్ విభాగాల్లో భారత అథ్లెట్లపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే భారత స్టార్ బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ సెమీఫైనల్‌కు నేరుగా అర్హత సాధించి దేశానికి కనీసం ఒక పతకాన్ని ఖాయం చేసింది. దీంతో భారత...