గ్యాస్ ధరల భారం ప్రజలపై కాదు.. రూ.700కు పైగా సబ్సిడీని భరించిన కేంద్రం!
ఉపశీర్షిక: ఎల్పీజీ వినియోగదారులకు కేంద్రం కీలక ప్రకటన • ప్రతి సిలిండర్పై రూ.700కుపైగా భారం భరించామని వెల్లడి • ఉజ్వలతో పాటు సాధారణ వినియోగదారులకూ ప్రయోజనం. కేంద్రం కీలక ప్రకటన.. గ్యాస్ ధరలపై భారీ భారం ప్రభుత్వానిదే దేశీయ వినియోగదారులకు ఎల్పీజీ సిలిండర్లను అందుబాటు ధరల్లో అందించేందుకు ప్రతి సిలిండర్పై రూ.700కు పైగా ఆర్థిక భారాన్ని కేంద్ర ప్రభుత్వం భరించిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అంతర్జాతీయ మార్కెట్లో ఎల్పీజీ ధరలు భారీగా పెరిగిన సమయంలో కూడా ఆ భారం పూర్తిగా ప్రజలపై పడకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్రభుత్వం ఈ వివరాలను వెల్లడించింది. అంతర్జాతీయ ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ,...