పీలేరు ప్రాంత అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి – సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు మంగిరి సాంబశివ, పీలేరు నియోజకవర్గ కార్యదర్శి టి.ఎల్. వెంకటేష్

జూలై 31, ఆగస్టు 1, 2 తేదీలలో పీలేరు పట్టణంలో నిర్వహించనున్న సీపీఐ జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులను పార్టీ శ్రేణులు, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు మంగిరి సాంబశివ, పీలేరు నియోజకవర్గ కార్యదర్శి టి.ఎల్. వెంకటేష్ పిలుపునిచ్చారు. బుధవారం కెవి మండలం స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద కరపత్రాలు విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పీలేరు నియోజకవర్గ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అభివృద్ధి పనులు నత్తనడకన సాగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. పీలేరు పట్టణంలో కొనసాగుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు...