విద్యార్థుల ఆగ్రహం ఢిల్లీని కుదిపేస్తోంది..! 'విద్యా వ్యవస్థను కాపాడండి' అంటూ దేశవ్యాప్తంగా మార్మోగుతున్న నినాదం
ప్రశ్నాపత్రాల లీకేజీలపై చర్యలు కోరుతూ జంతర్‌మంతర్‌లో నిరసనలు కొనసాగుతున్నాయి.. విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో ఉద్యమం ఉధృతి న్యూఢిల్లీ, జూలై 22: దేశవ్యాప్తంగా పరీక్షల నిర్వహణలో పారదర్శకత, ప్రశ్నాపత్రాల లీకేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ప్రారంభమైన విద్యార్థుల ఉద్యమం రోజురోజుకూ మరింత ఉధృతమవుతోంది. విద్యార్థి సంఘాలు, యువజన సంస్థలు, పలు సామాజిక వర్గాలు పెద్ద సంఖ్యలో ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నాయి. ఈ ఉద్యమంలో ప్రధానంగా విద్యా వ్యవస్థలో సమూల సంస్కరణలు, పరీక్షల భద్రతకు పటిష్టమైన విధానాలు, అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన నిరసనల సందర్భంగా పోలీసుల...