ఏపీ లో రేపటి నుంచి అకౌంట్లలోకి ‘తల్లికి వందనం’ డబ్బులు
తల్లికి వందనం పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 22 నుంచి 24వ తేదీలోగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.13 వేల చొప్పున డబ్బులు జమ చేయనుంది. అయితే ఇదే అదనుగా సైబర్ నేరగాళ్లు తల్లికి వందనం పేరుతో అనుమానాస్పద లింకులను ఫోన్లకు పంపే ఛాన్సుంది. ఈ లింకులపై క్లిక్ చేస్తే అకౌంట్లో డబ్బులను సైబర్ నేరగాళ్లు కొట్టేసే అవకాశం ఉంది. వీటిని క్లిక్ చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే సచివాలయాలు లేదా స్కూళ్లలో సంప్రదించాలని సూచిస్తున్నారు.