జాతీయ బాల స్వాస్థ్య కార్యక్రమం (ఆర్‌బీఎస్‌కే)–2.0లో చిన్నారులకు తొలిసారి షుగర్, బీపీ స్క్రీనింగ్
జాతీయ బాల స్వాస్థ్య కార్యక్రమం (ఆర్‌బీఎస్‌కే)–2.0లో 62.65 లక్షల మందికి 38 రకాల ఆరోగ్య పరీక్షలు థైరాయిడ్, ఊబకాయం, మొబైల్ వినియోగం, నిద్ర సమస్యలూ పరీక్షల పరిధిలోకి వ్యాధి గుర్తింపు నుంచి ఉచిత చికిత్స వరకు సమగ్ర వ్యవస్థ: మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ వెల్లడి చిన్న వయస్సులోనే మధుమేహం, అధిక రక్తపోటు వంటి జీవనశైలి వ్యాధులను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ప్రత్యేక స్క్రీనింగ్‌కు శ్రీకారం చుట్టింది. జాతీయ బాల స్వాస్థ్య కార్యక్రమాన్ని (ఆర్‌బీఎస్‌కే) మరింత విస్తరించి ఆర్‌బీఎస్‌కే–2.0గా అమలు చేస్తూ, రాష్ట్రవ్యాప్తంగా 62.65 లక్షల మంది చిన్నారులకు 38 రకాల సమగ్ర ఆరోగ్య పరీక్షలు** నిర్వహించనున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి *శ్రీ సత్యకుమార్...