ఆరోగ్యవంతమైన తల్లే.. ఆరోగ్యకరమైన భావితరానికి పునాది!
గర్భిణీ ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడమే లక్ష్యం.. పీహెచ్‌సీ తలుపులలో ఆరోగ్య విద్యా కార్యక్రమం తలుపుల, జూలై 18: గర్భిణీ స్త్రీల ఆరోగ్య పరిరక్షణ, తల్లి-శిశు సంక్షేమంపై అవగాహన కల్పించే ఉద్దేశంతో పీహెచ్‌సీ తలుపుల ఆధ్వర్యంలో ఆరోగ్య విద్యా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గర్భిణీలకు గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోషకాహారం ప్రాధాన్యత, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం, ప్రసవానికి ముందస్తు సన్నాహాలు వంటి అంశాలపై వైద్య సిబ్బంది అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు మాట్లాడుతూ, "ఆరోగ్యవంతమైన తల్లితోనే ఆరోగ్యవంతమైన శిశువు జన్మిస్తాడు.. ఆరోగ్యవంతమైన శిశువుతోనే ఆరోగ్యకరమైన భావితరం నిర్మితమవుతుంది" అని తెలిపారు. గర్భిణీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న ఉచిత వైద్య...