పుంగనూరు బైపాస్‌పై వరుస ప్రమాదాలు రోడ్డు భద్రతా చర్యలు చేపట్టాలని డాక్టర్ పి. అయూబ్ ఖాన్ డిమాండ్

పుంగనూరు, జూలై 18,రాజనీతి: పుంగనూరు పట్టణ బైపాస్ రోడ్డుపై తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై డాక్టర్ పి. అయూబ్ ఖాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బైపాస్ రోడ్డు మృత్యుకుహరంగా మారిందని, నిత్యం జరిగే ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోతుండగా, మరికొందరు తీవ్ర గాయాలతో శాశ్వత వికలాంగులుగా మారుతున్నారని అన్నారు. ఇటీవల బైపాస్ రోడ్డుపై చోటుచేసుకున్న ఘోర ప్రమాదాలు స్థానికులను తీవ్రంగా కలచివేశాయని పేర్కొన్నారు. బైపాస్ జంక్షన్ల వద్ద తగిన భద్రతా ప్రమాణాలు లేకపోవడం, హెచ్చరిక బోర్డులు, శాస్త్రీయ ప్రమాణాలతో స్పీడ్ బ్రేకర్లు, బ్లింకర్ లైట్లు, రాత్రి వేళల్లో సరిపడా వీధి దీపాల వెలుతురు లేకపోవడం వల్లే ప్రమాదాలు పెరుగుతున్నాయని ఆరోపించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,...