పిడుగుపాటుతో ప్రపంచ ప్రముఖుడి మరణమా?.. 2026పై నోస్ట్రాడమస్ జోస్యాలు మళ్లీ చర్చనీయాంశం
ప్రపంచ యుద్ధం, ప్రకృతి విపత్తులు, రహస్య హెచ్చరికలు.. మరోసారి తెరపైకి వచ్చిన నోస్ట్రాడమస్ ప్రవచనాలు ప్రపంచం, జూలై 18: 16వ శతాబ్దానికి చెందిన ఫ్రెంచ్ ప్రవక్త మైఖేల్ డి నోస్ట్రాడమస్ రాసిన ప్రవచనాలు మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. 1555లో వెలువడిన Les Prophéties గ్రంథంలోని కొన్ని శ్లోకాలను ఆధారంగా చేసుకుని, 2026 సంవత్సరానికి సంబంధించిన పలు సంఘటనలు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చించబడుతున్నాయి. అందులో ముఖ్యంగా ఒక ప్రముఖ వ్యక్తి పగటిపూట పిడుగుపాటుకు గురై మరణిస్తాడనే వ్యాఖ్య అత్యంత ఆసక్తికరంగా మారింది. ఈ ప్రవచనాన్ని కొందరు ప్రపంచ నాయకుడు, ప్రముఖ రాజకీయ నేత లేదా అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన వ్యక్తికి అన్వయిస్తుండగా, దీనికి...