కరోనాపై ప్రభుత్వం అప్రమత్తం.. భయానికి కాదు, జాగ్రత్తలకు ప్రాధాన్యం ఇవ్వండి: మంత్రి సత్యకుమార్
రాష్ట్రంలో 13 కేసులు నమోదు.. పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందన్న మంత్రి సత్యకుమార్ ఏపీలో కరోనాపై అప్రమత్తం.. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు అమరావతి, జూలై 17: దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం నమోదవుతున్న కరోనా కేసులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగుతోందని, ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం, దేశవ్యాప్తంగా ప్రస్తుతం 339 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో కేరళలో 115, కర్ణాటకలో 64, తమిళనాడులో 39 కేసులు నమోదుకాగా, ఆంధ్రప్రదేశ్‌లో...