రోహిత్ శర్మ రిటైర్ అవుతారా? లార్డ్స్ ODI అతని చివరి మ్యాచ్ కావచ్చు....
లండన్: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ (ఆదివారం లార్డ్స్‌లో) రోహిత్ శర్మ భారత్ తరఫున చివరి మ్యాచ్ కావొచ్చని ప్రచారం జరుగుతోంది. జాతీయ ఎంపిక కమిటీ ఈ యూకే టూర్ తర్వాత రోహిత్‌ను ఎంపిక చేయకపోవచ్చని PTI నివేదిక తెలిపింది. 39 ఏళ్ల రోహిత్ ఇటీవలి వన్డేల్లో ఆశించిన ప్రదర్శన చేయలేదు. చివరి 8 వన్డేల్లో 241 పరుగులు మాత్రమే చేశాడు. సగటు 30.1, స్ట్రైక్ రేట్ 88.6. ఈ సిరీస్‌లోనూ ప్రత్యేకంగా రాణించలేదు. ఎంపిక కమిటీ ప్లాన్: యశస్వి జైస్వాల్‌కు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని ఎంపిక కమిటీ ఆలోచిస్తోంది. ఇప్పటికే మూడు ఇన్నింగ్స్‌లో రెండు సెంచరీలు సాధించిన జైస్వాల్‌కు దీర్ఘకాలిక ప్లాన్‌లో ప్రాధాన్యత...