బిడ్డకు బిడ్డకు మధ్య ఎడం - తల్లి బిడ్డ సురక్షితం
ప్రెస్ నోట్ తేదీ:11-07-26 *పిలేరు లో ప్రపంచ జనాబా దినోత్సము కార్యక్రమాలు* డా:శ్రీగిరీష ప్రణాళికబద్ధమైన మాతృత్వంతో సురక్షితమైన కుటుంబం సాధ్యమని ఇందుకు వివిధ కుటుంబ నియంత్రణ పద్ధతులపై అవగాహన అవసరమని డా:శ్రీగిరీష డా:చంద్రశేఖర్ సంయుక్తంగా తెలిపారు. నేడు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా పిహెచ్ సి తలుపుల ప్రదానవైద్యాధికారులు ఆధ్వర్యంలో పీలేరు పట్టణ కోటపల్లెలో "బిడ్డకు బిడ్డకు మధ్య ఎడం - తల్లి బిడ్డ సురక్షితం"అంశంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కుటుంబ నియంత్రణ అనేది దంపతులు తమ జీవితంలో తీసుకునే అత్యంత గణనీయమైన ఆరోగ్య , నిర్ణయాలలో ఒకటని, గర్భధారణ మధ్య సరైన విరామం పాటించడం వల్ల అనుకోకుండా కలిగే గర్భధారణలను నివారించడమే కాకుండా, తల్లికి,శిశువుకు,కుటుంబానికి,సమాజానికి...