విద్యార్థుల్లో చట్టాలపై అవగాహనే మహిళా, చిన్నారుల భద్రతకు బలమైన పునాది.

తిరుపతి జిల్లా పోలీస్ శాఖ. తేదీ: 07-07-2026. - విద్యార్థుల్లో చట్టాలపై అవగాహనే మహిళా, చిన్నారుల భద్రతకు బలమైన పునాది. - ఎస్‌వీఐఎంఎస్ నర్సింగ్ కళాశాలలో మహిళా పోలీసుల ప్రత్యేక అవగాహన కార్యక్రమం. - పోక్సో చట్టం, మహిళల హక్కులు, సైబర్ నేరాలు, బాల్య వివాహాల నివారణపై సమగ్ర అవగాహన. - మాదకద్రవ్యాల వ్యసనం, మహిళలు–చిన్నారులపై నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు సూచన. - ప్రభుత్వ ఉద్యోగాల అవకాశాలు, లక్ష్యసాధనతో కూడిన విద్యపై ప్రేరణాత్మక సందేశం. తిరుపతి:07 తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు, మహిళా పోలీస్ స్టేషన్ అదనపు ఎస్పీ శ్రీమతి శ్రీలత గారి ఆధ్వర్యంలో,...