చిత్తూరు ఎమ్మెల్యే సమక్షంలో కుమార్ స్వామి జన్మదిన వేడుకలు
చిత్తూరు(రాజనీతి),(జులై 06),(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్):చిత్తూరు నియోజకవర్గ శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ వ్యక్తిగత సహాయకుడు (పి.ఏ.) కుమార్ స్వామి జన్మదిన వేడుకలు సోమవారం బెంగళూరులోని ఎమ్మెల్యే నివాసంలో నిర్వహించారు. ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ సమక్షంలో కుమార్ స్వామి కేక్ కట్ చేసి జన్మదినాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో పాటు ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సన్నిహితులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కుమార్ స్వామికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.