ర్యాంకు వచ్చింది... ఇప్పుడు జీవితాన్ని మలిచే నిర్ణయం మీదే!!!
ఏపీ ఈఏపీసెట్–2026 ఫలితాల విడుదలతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది కుటుంబాల్లో ఉత్కంఠకు తెరపడింది. నెలల తరబడి శ్రమించిన విద్యార్థులు తమ ప్రతిభకు తగిన ర్యాంకులు సాధించగా, మరికొందరు ఆశించిన ఫలితం కోసం ఇంకా ప్రయత్నించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఒక ప్రవేశ పరీక్ష ఫలితాన్ని జీవిత విజయానికి అంతిమ కొలమానంగా భావించడం సమంజసం కాదు. ఈఏపీసెట్ అనేది ఉన్నత విద్యలోకి ప్రవేశించే ఒక ద్వారం మాత్రమే. ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ వంటి రంగాల్లో అవకాశాలను అందించే ఈ పరీక్ష విద్యార్థుల ప్రయాణంలో తొలి అడుగు. అసలు సవాలు ఆ తర్వాతే ప్రారంభమవుతుంది. సరైన కోర్సు ఎంపిక, నాణ్యమైన విద్యాసంస్థ, నైపుణ్యాల అభివృద్ధి, పరిశోధనపై ఆసక్తి, పరిశ్రమ అవసరాలకు...