తప్పులు లేని ఓటర్ల జాబితా రూపకల్పనే లక్ష్యం – జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్
గుర్రంకొండ, జూన్ 27: జిల్లాలో తప్పులు లేని ఓటర్ల జాబితా రూపకల్పనే లక్ష్యం. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని జిల్లావ్యాప్తంగా పూర్తిస్థాయి పారదర్శకత, నిష్పాక్షికతతో నిర్వహించి తప్పులు లేని ఓటర్ల జాబితా రూపొందించే దిశగా అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. శనివారం గుర్రంకొండ మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాలు నెం.16, 17 పరిధిలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి బూత్ లెవల్ అధికారులు (BLOలు) నిర్వహిస్తున్న సర్ ఏన్యుమరేషన్ ఫారాల పంపిణీ, నమోదు ప్రక్రియ, ఓటరు వివరాల సేకరణ, ఆన్లైన్ డిజిటలైజేషన్ పనితీరును పరిశీలించి సంబంధిత అధికారులకు...