శాంతిభద్రతల పరిరక్షణలో కీలక బాధ్యత! అన్నమయ్య జిల్లా స్పెషల్ బ్రాంచ్‌కు నూతన సీఐ
పత్రికా ప్రకటన తేదీ: 25.06.2026 అన్నమయ్య జిల్లా-మదనపల్లి పోలీసు శాఖకు స్పెషల్ బ్రాంచ్ కళ్ళు, చెవులు: - జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్ గారు. అన్నమయ్య జిల్లా నూతన స్పెషల్ బ్రాంచ్ (ఎస్బి) సీఐగా శ్రీ యు. సదాశివయ్య నేడు బాధ్యతలు స్వీకరించి, జిల్లా ఎస్పీ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణలో ఎస్‌బీ పాత్ర చాలా కీలకమన్నారు. అసాంఘిక శక్తులపై నిరంతరం నిఘా ఉంచి, పక్కా ముందస్తు సమాచారంతో నేరాలను అరికట్టాలని నూతన సీఐని ఆదేశించారు. అంకితభావంతో పనిచేసి జిల్లా పోలీసు శాఖకు మరింత మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ,...