16 ఏళ్ల తర్వాత జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం – "ఉద్యోగుల సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం చిత్తూరు జిల్లా గళం"

✊ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో మరో కీలక ముందడుగు ✊ నేడు మధ్యాహ్నం ఒంటిగంటలకు చిత్తూరు జిల్లా కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్ , జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ చైర్మన్ శ్రీ సుమిత్ కుమార్ గారి అధ్యక్షతన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించబడింది. మెంబర్ సెక్రటరీ జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ మోహన్ కుమార్ గారు పాల్గొన్న ఈ సమావేశానికి 19 సభ్య సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. ఉద్యోగుల హక్కుల పరిరక్షణలో ఎల్లప్పుడూ అగ్రగామిగా నిలిచే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులసంఘం ఈ సమావేశంలోనూ తన ప్రత్యేక ప్రాతినిధ్యాన్ని చాటుకుంది. సంఘ జిల్లా అధ్యక్షులు వి శివయ్య గారు జిల్లాలో ఎదుర్కొంటున్న...