భారీ వర్షాల ఎఫెక్ట్‌.. చెన్నైకి మళ్లించిన ఇండిగో విమానం!

రేణిగుంట అక్టోబరు 16 (రాజనీతి): భారీ వర్షాలు విమాన రాకపోకలపై ప్రభావం చూపాయి. విజయవాడ నుంచి రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి రావాల్సిన ఇండిగో విమానాన్ని ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా చెన్నైకి మళ్లించారు. విమానం గగనతలంలో గంటకు పైగా చక్కర్లు కొట్టిన అనంతరం చెన్నైలో సురక్షితంగా దిగడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. విజయవాడ నుంచి మధ్యాహ్నం 3.20 గంటలకు రేణిగుంటకు చేరుకోవాల్సిన విమానం భారీ వర్షాల కారణంగా ల్యాండింగ్‌కు అనుకూల పరిస్థితులు లేకపోవడంతో కొంతసేపు గగనతలంలో చక్కర్లు కొట్టినట్లు సమాచారం. వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాన్ని చెన్నై విమానాశ్రయానికి మళ్లించినట్లు తెలిసింది. అక్కడ విమానం సురక్షితంగా ల్యాండ్‌ కావడంతో ప్రయాణికులకు ఊరట లభించింది. చెన్నైలో దిగిన విమానం...