పుంగనూరు ఘటన ప్రజాస్వామ్యంపై దాడి: పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్‌

రాజనీతి | పుంగనూరు | అక్టోబర్‌ 16, 2026 పుంగనూరు మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా జరిగిన దాడులు ప్రజాస్వామ్యంపై దాడితో సమానమని పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్‌ కుమార్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాయపడిన టీడీపీ కార్యకర్తలను ఆయన పరామర్శించారు. బాధితులతో మాట్లాడి ఘటన వివరాలను, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. నామినేషన్ల సందర్భంగా జరిగిన దాడులను తీవ్రంగా ఖండించిన పీలేరు ఎమ్మెల్యే | గాయపడిన టీడీపీ కార్యకర్తలకు పరామర్శ | బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ అనంతరం ఆసుపత్రి ఆవరణలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే...