ఆదర్శ విద్యావేత్త డాక్టర్ కె. రాజేంద్ర ప్రసాద్ జన్మదిన వేడుకలు
రేణిగుంట (రాజనీతి): విద్యాబోధనతో వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసిన ప్రముఖ విద్యావేత్త, గేట్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ కె. రాజేంద్ర ప్రసాద్ తన 65వ జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాలతో జరుపుకున్నారు. రేణిగుంట ఖాదీ కాలనీలోని మదర్ తెరిసా ఓల్డ్ ఏజ్ హోమ్లో కుటుంబ సభ్యులతో కలిసి జన్మదిన వేడుకలను నిర్వహించి, అక్కడి అనాథలు, అభాగ్యులకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేయడంతో పాటు అన్నదానం ఏర్పాటు చేశారు. సేవాభావంతో నిర్వహించిన ఈ కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో సాగింది. ఆశ్రమవాసుల మధ్య జన్మదిన వేడుకలు జన్మదినం సందర్భంగా ఆడంబరాలకు దూరంగా, సమాజంలో ఆదరణకు నోచుకోని వారితో ఆనందాన్ని పంచుకోవాలనే సంకల్పంతో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్...