పార్టీ కోసం పనిచేసిన 10వార్డు ప్రియకు అవకాశం దక్కాలని స్థానికుల ఆకాంక్ష
చిత్తూరు,(రాజనీతి): చిత్తూరు నియోజకవర్గంలోని 10వ వార్డు వెంగళరావు కాలనీలో టీడీపీ నాయకురాలు ప్రియ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. పార్టీ బలోపేతానికి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ, ప్రజలతో మమేకమవుతున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రస్తుత ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ విజయానికి ఆమె ప్రచారంలో పాల్గొన్నారని, ఆ సమయంలో ఎదురైన ఇబ్బందులు, అవమానాలను అధిగమిస్తూ పార్టీ కార్యకలాపాల్లో కొనసాగారని ఆమె అనుచరులు చెబుతున్నారు.ప్రియ కుటుంబానికి తరతరాలుగా తెలుగుదేశం పార్టీతో అనుబంధం ఉందని స్థానికంగా చర్చ సాగుతోంది. తాజాగా 10వ వార్డు కార్పొరేటర్ స్థానం ఎస్సీ వర్గానికి కేటాయించిన నేపథ్యంలో అభ్యర్థి ఎంపికపై ఆసక్తి నెలకొంది. పార్టీ తరఫున అధికారికంగా అభ్యర్థి పేరు ఖరారు...