పీలేరు నియోజకవర్గంలో రిజర్వేషన్లు ఖరారు.. ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలపై స్పష్టత!

ఆరు మండలాలకు రిజర్వేషన్ల ప్రకటన | జడ్పీటీసీల్లో మూడు బీసీలకు.. ఎంపీపీ స్థానాల్లో ఎస్సీ, బీసీలకు కేటాయింపులు | స్థానిక ఎన్నికలపై ఆశావహుల దృష్టి రాజనీతి | పీలేరు | అక్టోబర్‌ 15, 2026 అన్నమయ్య జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. పీలేరు నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాలకు సంబంధించిన రిజర్వేషన్ల వివరాలను అధికారులు వెల్లడించారు. దీంతో ఆయా మండలాల్లో ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులకు రిజర్వేషన్‌ స్థానాలపై స్పష్టత వచ్చింది. పీలేరు నియోజకవర్గం — రిజర్వేషన్ల వివరాలు మండలం జడ్పీటీసీ ఎంపీపీ పీలేరు బీసీ మహిళ అన్‌రిజర్వ్‌డ్‌ కలకడ బీసీ అన్‌రిజర్వ్‌డ్‌ మహిళ కలికిరి అన్‌రిజర్వ్‌డ్‌...