స్థానిక ఎన్నికల అభ్యర్థులకు ఊరట.. 24 గంటల్లోనే ధ్రువపత్రాలు!

రాజనీతి | అమరావతి | అక్టోబర్‌ 15, 2026 ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఊరట కల్పించింది. నామినేషన్లకు అవసరమైన నో డ్యూస్‌, కుల ధ్రువీకరణ పత్రాలను దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లోగా జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియలో ధ్రువపత్రాల జాప్యం కారణంగా అర్హులైన అభ్యర్థులు నష్టపోకుండా చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునేఠా వెల్లడించారు. నో డ్యూస్‌, కుల ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యానికి చెక్‌ | అధికారులకు ఎన్నికల కమిషనర్‌ పునేఠా ఆదేశాలు | సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా విజయవాడలో నిర్వహించిన మీడియా...