బీసీలకు సముచిత గౌరవం.. మేయర్ పదవి రిజర్వేషనే నిదర్శనం: ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్...
చిత్తూరు(రాజనీతి): తెలుగుదేశం పార్టీకి బీసీలే వెన్నెముక అని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ స్పష్టం చేశారు. నాడు నందమూరి తారక రామారావు టీడీపీని స్థాపించినప్పటి నుంచి నేటి వరకు బీసీలు పార్టీకి అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. బుధవారం చిత్తూరులోని బీసీ భవన్లో కూటమి పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.టీడీపీ అనేకమంది బీసీలకు ఉన్నత పదవులు కల్పించి గౌరవించిందని ఎమ్మెల్యే తెలిపారు. పార్టీ కోసం కష్టపడుతూ, ప్రజల్లో ఉంటూ పనిచేస్తున్న బీసీలకు మేయర్ పదవిని రిజర్వు చేయడం పార్టీలో వారికి ఉన్న ప్రాధాన్యాన్ని తెలియజేస్తోందన్నారు. బీసీలకు రాజకీయంగా మరిన్ని అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో పార్టీ ముందుకు సాగుతోందని చెప్పారు. రానున్న రోజుల్లో...