చిత్తూరు ఏపీఎస్ఆర్టీసీ కండక్టర్‌ పై రోజా చౌదరి ఫిర్యాదు

చిత్తూరు(రాజనీతి):ఏపీఎస్ఆర్టీసీ బస్సులో మహిళా కండక్టర్‌ దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ రోజా చౌదరి చిత్తూరు వన్‌ డిపో కంట్రోలర్‌ ప్రసాద్‌కు బుధవారం ఫిర్యాదు చేశారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం సాయంత్రం చిత్తూరు నుంచి ఐరాల మండలానికి వెళ్లే ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు (ఏపీ03జెడ్‌0018)లో ప్రయాణిస్తుండగా, నిర్ణీత స్టాప్‌లో బస్సు ఆపకుండా మరోచోట ఆపిన విషయమై కండక్టర్‌ను ప్రశ్నించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహిళా కండక్టర్‌ తనతో దురుసుగా మాట్లాడి దుర్భాషలాడారని ఆరోపించారు. ఐరాల బస్టాండ్‌ వద్ద ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని, అక్కడున్న కళాశాల విద్యార్థులతో వీడియోలు తీయాలని కండక్టర్‌ చెప్పినట్లు తన ఫిర్యాదులో పేర్కొన్నారని తెలిపారు. ఈ ఘటనతో మనస్తాపానికి గురైనట్లు రోజా చౌదరి...