ఏపీకి మూడు రోజుల వర్ష సూచన.. పిడుగులతో అప్రమత్తం!
రాజనీతి | అమరావతి | అక్టోబర్ 14, 2026 ఆంధ్రప్రదేశ్లో మరో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. నైరుతి బంగాళాఖాతంపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వాతావరణం మారనుంది. ఈశాన్య రుతుపవనాల ప్రభావం కూడా తోడవడంతో అక్టోబర్ 14 నుంచి 16 వరకు పలుచోట్ల ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం | నేడు 11 జిల్లాల్లో వర్షాలకు అవకాశం | 15న కోనసీమ, కృష్ణా.. 16న అల్లూరి,...