జాతీయ జెండా ఊపడం నేరమా?.. యువ కార్యకర్తల అరెస్టుపై విపక్షాల ఆగ్రహం!

రాజనీతి | న్యూఢిల్లీ | అక్టోబర్‌ 14, 2026 దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద నిరసన చేపట్టిన కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) కార్యకర్తల అరెస్టు రాజకీయ వివాదానికి దారితీసింది. జాతీయ జెండాతో నిరసన తెలిపిన సీజేపీ నేతలు సౌరవ్‌ దాస్‌, అశుతోష్‌ రాంకాలను పోలీసులు అదుపులోకి తీసుకోగా, ప్రత్యేక ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌ వారిని ఐదు రోజుల జ్యుడీషియల్‌ కస్టడీకి పంపించారు. ఈ చర్యను కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ, తృణమూల్‌ కాంగ్రెస్‌, డీఎంకే సహా పలు ప్రతిపక్ష పార్టీల నాయకులు తీవ్రంగా విమర్శించారు. జంతర్‌ మంతర్‌ నిరసనలో ఇద్దరు సీజేపీ నేతల అరెస్టు | ఐదు రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ |...