ఏపీలో స్థానిక ఎన్నికల సమరం.. పోలింగ్‌ తేదీలపై ఉత్కంఠ!

రాజనీతి | అమరావతి | అక్టోబర్‌ 14, 2026 ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం నేడు షెడ్యూల్‌ ప్రకటించే అవకాశముంది. ఉదయం 11.30 గంటలకు ఎన్నికల తేదీలను వెల్లడించవచ్చని సమాచారం. ఇప్పటికే ఎన్నికల నిర్వహణపై పలు తేదీలు ప్రచారంలోకి రావడంతో రాజకీయ పార్టీలతో పాటు ఆశావహుల్లో ఆసక్తి నెలకొంది. నేడు ఉదయం 11.30 గంటలకు ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించే అవకాశం | అక్టోబర్‌ 28న మున్సిపల్‌ పోరు.. నవంబర్‌ 3న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు? | మూడు దశల్లో పంచాయతీ పోలింగ్‌కు కసరత్తు మున్సిపాలిటీలు,...