38 ఏళ్ల పార్టీ సేవకు గుర్తింపు ఏదీ?...కజూర్ బాలాజీ కుటుంబానికి మేయర్ పదవి ఇవ్వాలి.. ప్రజల ఆకాంక్షకు ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి...
చిత్తూరు(రాజనీతి): తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం 38 సంవత్సరాలుగా ఒకే పార్టీని నమ్ముకుని నిరంతరం కష్టపడుతున్న చిత్తూరు సీనియర్ నాయకుడు కజూర్ బాలాజీ సేవలను గుర్తించి, ఆయనకు లేదా ఆయన కుటుంబ సభ్యులకు మేయర్ పదవి కల్పించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా అంకితభావంతో పనిచేస్తూ, ప్రజలకు సేవలందించిన నాయకులకు తగిన గుర్తింపు, సముచిత గౌరవం కల్పించాల్సిన అవసరం ఉందని వారు పేర్కొంటున్నారు. పదవులు ఆశించకుండా పార్టీనే నమ్ముకుని కష్టపడిన నాయకుల సేవలను గుర్తించి, పదవుల కేటాయింపులో వారికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు.దీర్ఘకాలంగా పార్టీ కోసం పనిచేసిన నాయకులకు తగిన గుర్తింపు లభిస్తే, ఇతర కార్యకర్తలకు కూడా ప్రోత్సాహం లభిస్తుందని అభిప్రాయపడుతున్నారు....