తిరుపతి రూపురేఖలు మార్చేలా రూ.3,222 కోట్ల అభివృద్ధి పనులు!
రాజనీతి | అమరావతి | అక్టోబర్ 12, 2026 ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతిని ఆధ్యాత్మికత, ఆధునిక సౌకర్యాల సమ్మేళనంగా అభివృద్ధి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ప్రణాళికలకు శ్రీకారం చుట్టింది. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) పరిధిలో రూ.3,222 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం శంకుస్థాపన చేశారు. అమరావతి సచివాలయం నుంచి వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు అవసరమైన సమాచారాన్ని అందించేందుకు రూపొందించిన ‘వెంకటాద్రి’ యాప్ను కూడా సీఎం ఆవిష్కరించారు. భక్తుల కోసం రూ.2,750 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పిలిగ్రిమ్ టౌన్షిప్ | రెండేళ్లలో పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు...