మేయర్‌ పీఠాలపై కూటమిలో కీలక మంతనాలు.. విజయవాడపై జనసేన గురి!

రాజనీతి | అమరావతి | అక్టోబర్‌ 12, 2026 ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార కూటమిలో మేయర్‌ పీఠాల పంపకాలపై కసరత్తు కీలక దశకు చేరుకుంది. రాష్ట్రంలోని 17 నగరపాలక సంస్థల్లో ఏ పార్టీ ఎన్ని మేయర్‌ స్థానాలకు పోటీ చేయాలి? ఏయే కార్పొరేషన్లను ఏ పార్టీకి కేటాయించాలి? అనే అంశాలపై తుది అవగాహనకు వచ్చేందుకు సోమవారం కూటమి అగ్రనేతలు సమావేశం కానున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ ఈ భేటీలో పాల్గొననున్నారు. సాయంత్రం 4 గంటలకు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో సమావేశం జరగనుంది. స్థానిక ఎన్నికల షెడ్యూల్‌...