అరుల్పురంలో 16వ డివిజన్ ఇంచార్జి గోపీనాథ్ ఆధ్వర్యంలో క్రికెట్ సంబరం.. గురజాల జగన్ మోహన్ కు అభినందనలు!
చిత్తూరు(రాజనీతి): చిత్తూరు నగరంలోని 16వ డివిజన్ అరుల్పురంలో నిర్వహించిన ‘అరుల్పురం క్రికెట్ ప్రీమియర్ లీగ్–2026’ టోర్నమెంట్ విజేత జట్లకు శనివారం సాయంత్రం బహుమతులు అందజేశారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, 16వ డివిజన్ ఇన్ఛార్జి గోపీనాథ్, అధ్యక్షుడు రవి నాయుడు, పీటర్ చేతుల మీదుగా బహుమతుల ప్రదానం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురజాల జగన్ కు అభినందనలు తెలియజేస్తూ కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. మూడ్ ఆఫ్ ఏపీ–చాణక్య స్ట్రాటజీస్ సర్వేలో ఎమ్మెల్యే రాష్ట్రస్థాయిలో ఏడో ర్యాంకు, జిల్లాలో మొదటి ర్యాంకు సాధించినట్లు పేర్కొంటూ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.క్రీడలు యువతలో ఐక్యత, క్రమశిక్షణ, పోటీతత్వాన్ని పెంపొందిస్తాయని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు....