స్థానిక ఎన్నికలకు సర్వం సిద్ధం.. నోటిఫికేషన్‌ విడుదలే తరువాయి!

రాజనీతి | అమరావతి | అక్టోబర్‌ 9, 2026 ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలను వేగవంతం చేసింది. ఎన్నికల నోటిఫికేషన్‌ ఎప్పుడు వెలువడినా వెంటనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభించేలా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునేఠా ఆదేశించారు. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లతో పాటు మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. న్యాయపరమైన అంశాలు, రిజర్వేషన్ల ప్రక్రియపై స్పష్టత వచ్చిన వెంటనే ఎన్నికల నిర్వహణకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లు, పంచాయతీరాజ్‌, పురపాలక...