అన్నదాతలకు దసరా కానుక.. ఖాతాల్లోకి రూ.6 వేలు!

రాజనీతి | అమరావతి | అక్టోబర్‌ 9, 2026 ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు దసరా పండుగ సందర్భంగా ఆర్థిక సాయం అందించేందుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రెండో విడత నిధులను త్వరలో విడుదల చేసే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకంతో కలిపి అర్హులైన ఒక్కో రైతు కుటుంబానికి రూ.6 వేల చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పండుగకు ముందే ఈ మొత్తాన్ని అందించేందుకు కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. రెండో విడతలో రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.4...