ప్రజాసేవలో 25 ఏళ్లు.. దేశం నిరంతర ప్రగతి బాటలో సాగాలి: మోదీ

రాజనీతి | జాతీయం | అక్టోబర్‌ 7, 2026 ప్రజాసేవలో **25 ఏళ్ల మైలురాయిని** చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ.. దేశం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని **శ్రీ వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన** ఆయన.. దేశ ప్రజల సుఖసంతోషాలు, ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ప్రార్థించారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో భారత్‌ నిరంతర ప్రగతి బాటలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. గుజరాత్‌ సీఎంగా మొదలైన ప్రయాణానికి పాతికేళ్లు.. ప్రజల ఆశీర్వాదమే తన బలం అన్న ప్రధాని **2001 అక్టోబర్‌ 7న గుజరాత్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో** మోదీ ప్రజాజీవితంలో ప్రభుత్వ అధిపతిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత...