హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం.. అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీకి గుడ్‌బై!
రాజనీతి | స్పోర్ట్స్ | అక్టోబర్ 6, 2026 దాదాపు పదేళ్ల నాయకత్వానికి ముగింపు.. వరల్డ్‌కప్, ఆసియా క్రీడల స్వర్ణం అందించిన కెప్టెన్ ఇక కేవలం ఆటగాడిగానే కొనసాగనుంది! భారత మహిళల క్రికెట్లో కీలక మార్పు చోటుచేసుకుంది. టీమిండియా మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. టెస్టులు, వన్డేలు, టీ20ల్లో ఇకపై ఆమె కెప్టెన్‌గా కొనసాగరు. అయితే భారత జట్టుకు ఆటగాడిగా ప్రాతినిధ్యం వహిస్తానని స్పష్టం చేశారు. హర్మన్‌ప్రీత్ 2016లో భారత టీ20 జట్టు పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టారు. మిథాలీ రాజ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత 2022లో వన్డే, టెస్టు జట్లకూ...