చిత్తూరు నియోజకవర్గ శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ దెబ్బకు.. సంతపేటలో అభివృద్ధి వెలుగులు
చిత్తూరు(రాజనీతి): ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటూ అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యమిస్తామని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. సంతపేటలో రూ.476.95 లక్షల విలువైన అభివృద్ధి పనులను శనివారం ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావుతో కలిసి ఆయన ప్రారంభించారు. రూ.140.50 లక్షలతో నిర్మించిన కాలువ, రూ.336.45 లక్షలతో నిర్మించిన 300 కిలోలీటర్ల సామర్థ్యమున్న జీఎస్ఎల్ఆర్ ట్యాంకును ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చిత్తూరు అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు కేటాయిస్తోందన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. సంతపేట ప్రజలు ఏళ్లుగా ఎదుర్కొంటున్న కాలువలు, రోడ్లు, వీధిలైట్ల సమస్యలను పరిష్కరించామని తెలిపారు. ఎన్టీఆర్ జలాశయం నుంచి ట్యాంకుకు నీటిని...